Saturday, July 3, 2010

ఝుమ్మంది నాదం!!

మిగిలింది ఖేదం!!

నా గురించి కాదు చెప్పింది, మంచు మనోజ్ గురించి. పాపం ఏదో ప్రయోగాలు అని పేరు చెప్పుకుని కూస్త మంచి పేరే తెచ్చుకుంటున్నాడు గురుడు. అలాంటిది ఏం పాపం చేసాడో కానీ ఆ దాసరి దాపురించాడు తన జీవితానికి. చక్కగా నడుస్తున్న తన బండిని రోడ్ రోలర్ తో గుద్దించి పీస్‌పీస్ చేసిపారేసాడు.

ఏందీ తీసింది ఒక ముసలాయన అయితే ఇంకో ముసలాయన్ని అంటున్నాడేమిటి అనుకుంటున్నారా? ... ఉండండి ... అక్కడికే వస్తున్నా ... ఏదో కొంచెం మంచి నటుడు అని పేరు తెచ్చుకుని, హీరో గా కాకపోయినా ఎవరన్నా మంచి దర్శకుడి చేతిలో పడితే విలన్ గా అయినా సెటిల్ అవ్వగల కొడుకు కెరీర్ ని నామరూపాల్లేకుండా చేసిన దాసరి ఇప్పుడు మంచు ఫ్యామిలీ మీద పడినట్టున్నాడు. తన దగ్గర శిష్యరికం చేస్తున్న పెద్ద మంచు  ఆయనగారి ఇన్స్పిరేషన్ తో బంగారం లాంటి తన కొడుకు భవిష్యత్తుని గంగ లో కలిపేసేందుకు మంచి పునాది వేసాడు ఈ సినిమాతో ...

బాబోయి, నా యొక్క వల్ల కాదు ఈ సినిమా గురించి చెప్పడం ... ఆల్రెడీ చాలా రివ్యూస్ లో హీరోయిన్ గురించి, దర్శకేంద్రుని బూతుల గురించీ చెప్పేసారు ... ఇక నేను చెప్పనీకి ఏం మిగల్లేదు ... మీకేమాత్రం బతుకు మీద ఆశ ఉన్నా, ఈ సినిమా ని కిలోమీటరు దూరం ఉంచండి అని మాత్రం చెప్పగలను ... వేరే రివ్యూస్ లో రాసినట్టు 2/2.5 కాదు కదా ... ఒక 0.25 కూడా ఇవ్వలేను ... ఇక పై మీ ఇష్టం(ఖర్మ)

బాబోయ్ ఆ ఎంత యాపిల్స్ కాయలు బోర్ కొట్టేస్తే మాత్రం ... ఆ కొబ్బరి చిప్పలు, గుమ్మడికాయలు ఏంది తాతో ...

Saturday, May 15, 2010

అందరి బంధువయ - మెసేజ్ కోసం బుర్ర మాసాజ్ అవసరం లేదు

తలనొప్పిగా ఉందని ... కొంచెం రీఫ్రెష్ అవుదామని మంచి సినిమా అంటున్నారని నిన్న అందరి బంధువయ్యా కి పోయాను ... బాణం దెబ్బ తిన్నాక కూడా మళ్ళా అదే తప్పు చేసినందుకు చింతిస్తున్నా ... సారి తగిలినది మాత్రం చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి

ముందుగా రివ్యూస్ ఇచ్చినవారికి ... మెసేజ్ ఉంది అన్న ఒక్క పాయింట్ మీద చెత్తా చెదారాన్ని మా మీదకి ఊడ్చొద్దు ... సినిమా కి మెసేజ్ ఉన్నా కొంచెం చూడబుల్ గా ఉంటేనే వెళ్తారు((at least నేను) ...

సినిమా ఇస్టోరీ ... నలుగురు కాన్సెప్టే కాస్త అటూ ఇటూగా ... కాకపోతే సినిమాలో మెసేజి కి తను(చంద్ర సిద్దార్థ) ఎంచుకున్న యముడు-అప్పులోడు-చెడ్డ కొడుకుల క్యారక్టర్స్ కథకి ఆయువుపట్టు ... అలాంటి పట్లు సినిమాలో ఏమీ లేవు(ఉంది ఒక క్యారక్టర్, కానీ కమెర్షియల్ దారిలో పడ్డ డైరెక్టర్ కి దాన్ని ఏం చెయ్యాలో అర్థం కాలేదు) ...

చూచాయగా కథ చెప్పాలంటే హీరో మంచివాడు ... అందరికీ సాయపడడమే జీవిత లక్ష్యం అని అనుకుంటూ జీవించే వాడు ... ఒక పీనాసి హీరోయిన్ ... తన మంచితనంతో హీరోయిన్ పీనాసితనం ని ఎలా పోగొట్టాడు అనేది కథ ... హిహి ... ఎజ్జాట్ గా ఇది కాదు అనుకోండి ... సినిమాలో నాకు కనపడింది చెప్పాను ... మీకు ఇంకేమన్నా కనపడితే నన్ను తిట్టమాకండి ... మధ్యలో మంచితనానికి పరాకాష్ట అయిన తండ్రి, స్వార్థానికి పరాకాష్ట అయిన ఇంకో తండ్రి, పరాకాష్టకే పరాకాష్ట అయిన ఒక ABCD వస్తారు ... ఆఁ ... కథ(?) కి పెద్దగా ఊపయోగపడేవారు కాదు లేండి వీళ్ళు

సరే, performance కాడికి వద్దాం ...  


శర్వానంద్, అబ్బో కేక తోపు తురుం రోటీ పకోడీ (ఇట్టా చెప్పకపోతే ట్యాలెంట్ ని గుర్తించడంలేదన్న నెపం ... నాకెందుకులేండి

పద్మప్రియ ... వద్దూఊఊఊఊ ... నా వల్ల కాదూఊఊఊఊఊ

 
నరేష్ .... కేక ... "మీ శ్రేయోభిలాషి" సినిమా లో నరేష్ యాక్షన్ చూసి తరించారా? ... అదే నరేష్ ... తరించండి

 
హీరో ఫ్రెండ్(అల్లరి లో పొట్టి సైడ్ హీరో) ... తన తండ్రి తో పండించిన బొమ్మరిల్లు ప్యారడీ హాస్యం ... అదుర్స్(ఇది నిజ్జంగా నిజం


డైరెక్షన్ ... చాలా డిజప్పాయింట్ చేసారు రావుగారూ ... మెసేజ్ ఇవ్వండి మీ స్టైల్ లో ... కమెర్షియల్ యాస్పెక్ట్స్ మీకు నప్పవ్ ... లైట్ తీసుకోండి  


సంగీతం, పాటలు ... హహ ... సో ఫన్నీ ... చూసి నవ్వుకోనీకి బావున్నాయ్ 


డైలాగ్స్, లిరిక్స్ ... ఉన్నవే కొన్ని(అదే మెసేజ్) ... అవి కాస్తా చెప్పేస్తే చూడడం దేనికి?


సినిమా కి రేటింగ్ ... 2/5(for message)

suggestion: అంత చెప్పాక సినిమా చూడాలనుకుంటున్నారా? ... అయితే మీకొక relief - వరుడు కంటే వెయ్యిరెట్లు బెటర్ సినిమా ... అదే చూసిన వారికి ఇది ఎక్కేస్తది