Saturday, August 1, 2009

మగధీర రివ్యూ!! ( my view) :)



రాజమౌళీ -

నాకు ఈ సినిమా మీద మొదట అన్ని expectations ఏమీ లేవు ... రెండు నెలల క్రితం ఒక మూవీ ఇన్సైడర్ చెప్పిన తీరు చూసి బాగా తీస్తున్నారు అని తెలిసింది ... అప్పట్నుంచి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను ... వివిధ కారణాల వలన మొదటి రోజు చూడలేనేమో అనుకున్నా కానీ మొత్తానికి వీలు చిక్కించుకుని చూసేసా ...

3.30 కి సినిమా మొదలయ్యింది ... హాల్ మొత్తం నిండి ఉంది ... (ఎక్కువమంది బెంచ్ మీద ఉండడం వలనో ఏమో) ... మొదటి 15ని|| పెద్ద గోలేమీ లేదు ... ఎవడో అత్యుత్సాహం ప్రదర్సించినా పెద్దగా రెస్పాన్స్ ఏమీ లేదు ... 15ని|| అయ్యాక బంగారు కోడిపెట్ట సాంగ్ ... నెమ్మదిగా అరుస్తున్నారు జనాలు కానీ పెద్ద ఊపు లేదు ... ఇంతలో చిరు స్క్రీన్ మీదకి వచ్చాడు ... ఆ వున్న 2-3ని|| నాకు డైలాగ్స్ వినపడలేదు అసలు


ఇంక ఇక్కడి నుంచీ ఒక 45 ని||రొటీన్ లవ్ స్టోరీతో నడిచిపోయింది ... ఇంటర్వల్ అన్నాడు ... టైం ఎంతైందా అని చూస్తే 5.00 ... సినిమా మొదలయ్యి 1.30 గంటలయ్యిందా? అసలు తెలీలేదే!! కథ రొటిన్ అయినా రాజమౌళీ మ్యాజిక్ కదా అలానే ఉంటుందిలే అనుకున్నా ...

సరే రెండో భాగం లో 400 యేళ్ళ వెనక్కి వెళ్ళాం ... కొంచెం కొంచెం ముందుకి పోతూంటే ఏదో తెలియని ఆనందం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి వొళ్ళు జలదరిస్తుంది ... ఈ తన్మయత్వం ఫ్లాష్ బాక్ ముగిసే సమయానికి పరాకాష్టకి చేరుకుంది ... ఒట్టు ఈ ఫైట్ అప్పుడు ఒక్క మనిషి కూడా మాట్లాడలేదు(మే బి నాకు వినపడలేదని చెప్పొచ్చేమో!!) ... ఆంధ్రాకేఫ్ వాడు రాసినట్టు చంపడం అనేది హింసలా కాకుండా ఒక కళలా తీయడంలో రాజమౌళి ఆరితేరాడు .. న భూతో న భవిధ్యత్

ఫ్లాష్ బాక్ అయ్యాక సినిమా తొరగా తేల్చేసాడు (అదే అందరూ వీక్ క్లైమాక్స్ అన్నారు కానీ దాన్ని అలా కావాలనే చేసారేమో అనిపించింది) ... ఆ ఫ్లాష్‌బ్యాక్ క్లైమాక్స్ మధురానుభూతిని మరవకుండా చేసింది ఇది ...


చరణ్ - సైన్యాధ్యక్షుడి పాత్రలో అలా అతికిపోయాడు ... చెప్పడానికి మాటలు లేవు ... భాష ఉచ్చారణలో నాన్న లా అనవసరమైన చోట వత్తులు పెట్టడం ఉన్నా ఆ పాత్ర లో చక్కగా ఇమిడిపోయాడు ... పౌరాణికాలకి సూట్ అవ్వగల యువ కథానాయకుడు అన్న ప్రశ్న కి నాకు సమాధానం దొరికింది ... మోడర్న్ లుక్ లో మాత్రం ప్రధమార్థం లో కొన్ని చోట్ల "భరించాల్సి" వచ్చింది ... నాకోసం నువ్వు అనుకుంట ... ఆ పాటలో ఇది చరణేనా అనిపించింది ... అంత బాగున్నాడు... డ్యాన్స్ లు, ఫైట్స్ గురించి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ప్రూవ్ చేస్కున్నాడు దాన్లో కింగ్ అని ... ఓవరాల్ గా కామెడీ, రొమాన్స్ డిపార్ట్మెంట్స్ లో బాగా ఇంప్రూవ్ అవ్వాలి ... (ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ రొమాన్స్ సెక్షన్ లో వీకే, హీరోయిన్ ని టీజ్ చెయ్యమంటే మాత్రం ముందుంటారు) ... నెక్స్ట్ సినిమా లో లవర్ బాయ్ తరహా అంటున్నారు ... చూద్దాం

కాజల్ - అబ్బా, ఎంత బాగుందో
కొంచెం బొద్దుగా అయింది ... కొత్తగా ఉంది ... చాల నచ్చింది ... అక్కడక్కడా ఓవర్ చేసినా రాజమౌళి కదా నెట్టుకొచ్చేసాడు ...

విలన్ పాత్రధారి, రొటీన్ ... నాకు పెద్ద గొప్పగా ఏమీ అనిపియ్యలేదు ...

శ్రీహరి - డైలాగ్ కింగ్ ... ఫ్లాష్ బ్యాక్ అంతలా ఆకట్టుకోడానికి శ్రీహరి పాత్ర 25% పనిచేసింది ... బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా ఆ గొంతులో ఉన్న పవర్ కే గుండెకాయ్ సగం జలదరిస్తుంది


మ్యూజిక్ - మిగతా రివ్యూస్ లో చెప్పినట్టే వినడానికంటే చూడ్డానికే బావున్నాయి ... బ్యాక్గ్రౌండ్ మాత్రం కేక (ఇది కూడా రాజమౌళి సినిమాల్లో కామనే కదా)

గ్రాఫిక్స్, ఫైట్స్ గురించి ద్వితీయార్థ వర్ణణే చాలనుకుంట ... hats-off to them

అశ్లీలత - బూతులే లేవన్నారు సినిమాలో ... రాజమౌళి ఈ విషయం లో మళ్ళా నిరాశే మిగిల్చాడు ... రివ్యూస్ లో రాసింది అబద్దం ఈ ఒక్క విషయం లో మాత్రం


ఫైనల్ గా మూవీ కేక ... ద్వితీయార్థం థియేటర్‌లో చూడకుండా ఎక్కడ చూసినా దండగే ... తప్పకుండా చూడండి మరి

My Rating: 3.5/5(1st half) ... 5/5(2nd half)