Saturday, July 3, 2010

ఝుమ్మంది నాదం!!

మిగిలింది ఖేదం!!

నా గురించి కాదు చెప్పింది, మంచు మనోజ్ గురించి. పాపం ఏదో ప్రయోగాలు అని పేరు చెప్పుకుని కూస్త మంచి పేరే తెచ్చుకుంటున్నాడు గురుడు. అలాంటిది ఏం పాపం చేసాడో కానీ ఆ దాసరి దాపురించాడు తన జీవితానికి. చక్కగా నడుస్తున్న తన బండిని రోడ్ రోలర్ తో గుద్దించి పీస్‌పీస్ చేసిపారేసాడు.

ఏందీ తీసింది ఒక ముసలాయన అయితే ఇంకో ముసలాయన్ని అంటున్నాడేమిటి అనుకుంటున్నారా? ... ఉండండి ... అక్కడికే వస్తున్నా ... ఏదో కొంచెం మంచి నటుడు అని పేరు తెచ్చుకుని, హీరో గా కాకపోయినా ఎవరన్నా మంచి దర్శకుడి చేతిలో పడితే విలన్ గా అయినా సెటిల్ అవ్వగల కొడుకు కెరీర్ ని నామరూపాల్లేకుండా చేసిన దాసరి ఇప్పుడు మంచు ఫ్యామిలీ మీద పడినట్టున్నాడు. తన దగ్గర శిష్యరికం చేస్తున్న పెద్ద మంచు  ఆయనగారి ఇన్స్పిరేషన్ తో బంగారం లాంటి తన కొడుకు భవిష్యత్తుని గంగ లో కలిపేసేందుకు మంచి పునాది వేసాడు ఈ సినిమాతో ...

బాబోయి, నా యొక్క వల్ల కాదు ఈ సినిమా గురించి చెప్పడం ... ఆల్రెడీ చాలా రివ్యూస్ లో హీరోయిన్ గురించి, దర్శకేంద్రుని బూతుల గురించీ చెప్పేసారు ... ఇక నేను చెప్పనీకి ఏం మిగల్లేదు ... మీకేమాత్రం బతుకు మీద ఆశ ఉన్నా, ఈ సినిమా ని కిలోమీటరు దూరం ఉంచండి అని మాత్రం చెప్పగలను ... వేరే రివ్యూస్ లో రాసినట్టు 2/2.5 కాదు కదా ... ఒక 0.25 కూడా ఇవ్వలేను ... ఇక పై మీ ఇష్టం(ఖర్మ)

బాబోయ్ ఆ ఎంత యాపిల్స్ కాయలు బోర్ కొట్టేస్తే మాత్రం ... ఆ కొబ్బరి చిప్పలు, గుమ్మడికాయలు ఏంది తాతో ...